బీఆర్ఎస్ తో కొత్త చరిత్ర సృష్టిస్తాం : కవిత
దేశంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తో కొత్త చరిత్ర స్పష్టిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో బీజేపీకి బుద్ధి చెబుతామన్నారు. బతుకమ్మను కూడా బండి సంజయ్ అవమానించారన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందన్నారు. ప్రధాని మోదీ, మమతా బెనర్జీని, బండి సంజయ్ నన్ను అవహేళన చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలోనూ ఆ పార్టీకి బుద్ది చెప్పారు. యాగాలు చేయడం కేసీఆర్ కు కొత్త కాదన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోతోందన్నారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం ఉన్నందు ఇంకా అక్కడ మా వ్యూహాలు ఆలోచించలేదన్నాదరు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడి వెళ్లి ప్రచారం చేసి ఆయన్ను ఓడిస్తా అన్నారు.













