పడింది.. ఇప్పటికి 242మందికి మెమోలు
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఇక అంతే సంగతి. పాయింట్ వేస్తారు.. లైసెన్స్ క్యాన్సల్ చేస్తారు. పాయింట్ పడుద్ది అంటూ జనాన్ని బెంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. తమ సిబ్బంది విషయంలో ఏం చేస్తున్నారు. జనం వేరు.. తాము వేరు అని వదిలిలేస్తున్నారా..? ముగ్గురు వెళ్లినా.. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. ఫోన్ లో మాట్లాడినా.. పట్టించుకుంటున్నారా లేదా… ? వీటికి ఆన్సర్ ఇస్తోంది డిపార్ట్ మెంట్.
తప్పు ఎవరు చేసినా.. తప్పు తప్పే. అదే రూల్ ను తమ సిబ్బంది విషయంలోను పాటిస్తున్నామంటున్నారు అధికారులు. దీనికి రుజువుగా ఇప్పటి వరకు మొత్తం 242 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు మెమోలు జారీ చేసిన విషయం గురించి చెబుతున్నారు. ఇప్పటి వరకు మెమోలు అందుకున్నవారిలో అదనపు ఇన్స్పెక్టర్ ఒకరుండగా, ఎస్సైలు 66మంది, హెడ్–కానిస్టేబుళ్లు 9మంది, కానిస్టేబుళ్లు 86మంది ఉన్నారు. వీరిలో ఆరుగురిపై బదిలీ లేదా అటాచ్మెంట్ వేటు కూడా పడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మీడియాకు చిక్కిన రామ్‌గోపాల్‌పేట కానిస్టేబుల్ కె.రాకేష్సాగర్ను సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తమపై ప్రజల్లో చులకన భావం పెరగకుండా.. తమను తాము సరిదిద్దుకుంటున్నామంటున్నారుఉన్నతాధికారులు. యూనిఫాంలో ఉండి పోలీసులు ఎవరైనా.. నిబంధనలు పాటించకపోతే వారిపై మరింత సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌లు చేపట్టిన అధికారులు, కొన్నాళ్లుగా మెమోలు జారీ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్, సోషల్ మీడియా, న్యూస్ పేపర్ లలో వచ్చిన ఫొటోలు ఆధారంగా చర్యలుంటున్నాయంటున్నారు













