పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ?
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎంపీ బరిలో దించాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కొప్పుల ఈశ్వర్‌కు సమాచారం అందించినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం 2014లో విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా చేశారు. 2018లో కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. విశేష రాజకీయ అనుభవంతో పాటు సింగరేణి కార్మికుల్లో మంచిపట్టున్న కొప్పుల ఈశ్వర్‌ను బరిలోకి దించితే పెద్దపల్లి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేయవచ్చని అధినేత కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.













