ప్రాధానత్య పెరిగింది వ్యక్తులకు కాదు.. పార్టీకి : రేవంత్
గత రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రాధాన్యత పెరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అయితే ప్రాధాన్యత పెరిగింది వ్యక్తులకు కాదు, పార్టీకి అని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది జాతీయ నాయకులు వరుసగా తెలంగాణకు వస్తున్నారన్నారు. ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు పెట్టకుండా తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే తెలంగాణ కాంగ్రెస్‌కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చని అన్నారు. రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన సభలు అధికార పార్టీ కూడా చేయలేకపోయిందని పేర్కొన్నారు.













