మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈటల రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానం ఇప్పటివరకు ఖాళీగా ఉంది. తాజాగా మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ శాఖ కేటాయించారు. గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.













