తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణ శాసనమండలి చీఫ్‌విప్‌గా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు అందుకున్నారు. చీఫ్‌విప్‌గా నియమితులైన మహేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చట్టసభల్లో ఎంతో అనుభవం ఉన్న పట్నం మహేందర్ రెడ్డి చీప్ విప్ గా నియమితులవడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.