తెలంగాణలో పాస్‍పోర్టు సేవలు నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలో లాక్‍డౌన్ కారణంగా ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అన్ని రకాల పాస్‍పోర్టు సేవలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‍పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‍పోర్టు కార్యాలయ ఆవరణలోని విదేశీ వ్యవహారాలశాఖకు చెందిన సెక్రటేరియెట్ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాస్‍పోర్టు సేవా కేంద్రాలు, లఘు కేంద్రాలు, పోస్టాఫీసు పాస్‍పోర్టు సేవాకేంద్రాలతో పాటు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‍పోర్టు కార్యాలయంలోని అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అపాయింట్‍మెంట్లను రీ షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.