సీఎం రేవంత్ తో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ
తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా వివేక్ కె.టంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమైంది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని సీఎంవో సృష్టం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిపాలనా విధానాలకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి సీఎం వారికి వివరించారు. ఆరు గ్యారెంటీల అమలు క్రమంలో ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని, అందుకు ఖర్చు చేస్తున్న నిదుల వివరాలను చెప్పారు. సంక్షేమమే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శన సింగ్ విల్సన్, లోక్సభ సభ్యులు వీణా దేవి, జస్బీర్ సింగ్గిల్, రాఘురామ కృష్ణం రాజు, ఇతర పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ సభ్యులు ఉన్నారు.













