స్కూళ్లకు పంపడమా? లేదా? అన్నది తల్లిదండ్రుల ఇష్టం : తెలంగాణ కేబినెట్

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి అన్ని కేటగిరీలకు చెందిన విద్యా సంస్థలను ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. అయితే విద్యార్థులను స్కూళ్లకు పంపాలా? వద్దా? అన్నది తలిదండ్రుల నిర్ణయానికే కేబినెట్ వదిలేసింది. అలాగే తప్పనిసరిగా స్కూళ్లకు రావాలని విద్యార్థులను బలవంత పెట్టకూడదని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. పాఠశాలలకు రాలేకపోతున్న విద్యార్థులు, ఆన్‌లైన్ ద్వారా కూడా తరగతులకు హాజరుకావొచ్చని, యాజమాన్యాలు ఏమీ అనకూడదని కేబినెట్ ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖకు కూడా కేబినెట్ సూచించింది.