ఆమెపై 9ఏళ్లుగా అత్యాచారం..అదీ 139 మంది..
అంతటా కోవిడ్ తప్ప మరేదీ జనానికి పట్టడం లేదు. దీంతో సంచలనాలు గా మారాల్సిన ఉదంతాలు కూడా సింపుల్ గా మాయమైపోతున్నాయి. అలాంటి ఉదంతాల్లో రెండ్రోజుల క్రితం తెలంగాణ రాజధాని నగరంలో ఓ యువతి చేసిన ఫిర్యాదు. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదీ గడచిన తొమ్మిదేళ్లుగా తనపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయని, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా వారు లైంగికంగా తనను వేధించారని మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.
ఈ కేసును నమోదైతే చేశారు గానీ, కేసు దర్యాప్తు ఎలా? అనేదానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా ఆమె ఫిర్యాదు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటమే ఇందుకు కారణం. దర్యాప్తు సిన్సియర్‌గా చేస్తే అందరి దృష్టీ ఈ కేసు మీదకు మళ్లడం తధ్యం. ఇది లేనిపోని తలనొప్పులు తెచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో న్యాయనిపుణుల సలహా లేకుండా దర్యాప్తు చేపట్టకూడదని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో దర్యాఫ్తు అధికారిగా ఎవరిని ఉంచాలన్న విషయమై కూడా పోలీసులు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. డీజీపీ అనుమతిస్తే, సీఐడీ చేతిలో ఈ కేసు దర్యాప్తును పెట్టవచ్చునని తెలుస్తోంది.
ప్రస్తుతం బాధితురాలిని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంచి, నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడితో ఉందని ఇనస్పెష్టర్ నిరంజన్ రెడ్డి చెప్పారు. మహిళా అధికారుల సహాయంతో ఆమెను ప్రశ్నించి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఏసీపీని, ఆయనకు సహాయంగా నలుగురు ఇనస్పెక్టర్ల బృందానికి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఎవరా యువతి?
ఫిర్యాదు చేసిన యువతి 40పేజీల పత్రాలు పోలీసులకు సమర్పించిందని, అందులో వేల సంఖ్యలో ఫొటోలు, కొన్ని వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయనేత పిఎ, బాగా లావుగా ఉండే ఒక సినీ హీరో… ఇంకా మరికొందరి పేర్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. గత 2009లో ఈమెకు పెళ్లికాగా ఏడాదిలోనే విడాకులు తీసుకుందని స్వేఛ్చాభావాలు ఎక్కువని తెలుస్తోంది. ఆమె శారీరకంగా పూర్తి బలహీనంగా ఉందని, గత ఆర్నెళ్లుగా సోమాజిగూడలోని ఓ స్వఛ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం.













