మహిళపై 139మంది రేప్ కేసు..సిసిఎస్‌కు బదిలీ..
హైదరాబాద్ లో సంచలనం రేపిన మహిళ రేప్ కేసులో పోలీసు దర్యాప్తుకు సిద్ధమయ్యారు. తనను గత 9ఏళ్లుగా 139 మంది లైంగిక దాడి చేశారని ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంగళవారం ఈ మహిళ ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. తనను రేప్ చేసిన వారిలో పలువురు సినీనటులు, రాజకీయనేతల పేర్లు చెప్పడం ఉన్నతాధికారుల్లో కదలిక తెచ్చింది. మొత్తం మీద నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మంగళవారం సిసిఎస్‌కు బదిలీ చేశారు.













