మలేసియాలో మాదిరి.. తెలంగాణలోనూ : మంత్రి తుమ్మల

మలేసియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్ విత్తన కేంద్రం (సీడ్‌గార్డెన్)ను ఏర్పాటు చేసి, విత్తనాలను సమకూర్చుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికి మలేసియాలోని ఎఫ్‌జీవీ కంపెనీ సహకారం తీసుకుంటామన్నారు. మలేసియా పర్యటనలో భాగంగా ఆయన కౌలాలంపూర్‌లోని ఎఫ్‌జీవీ సీడ్‌గార్డెన్‌ను సందర్శించారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగు భారీగా పెరుగుతున్నందున సొంతంగా విత్తన కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేపడతామన్నారు. కంపెనీ వారు సహాయ సహాకారాలు అందిస్తామన్నారని మంత్రి తెలిపారు.