Medaram: గద్దెలపై కొలువుదీరిన పిగిడిద్దరాజు, గోవిందరాజు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం (Medaram)లో గద్దెలపై పగిడిద్దరాజు ( Pagididdaraju), గోవిందరాజులు (Govindaraj) కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6 గంటలకు, పగిడిద్దరాజు ను 9:45 గంటలకు పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క (Minister Seethakka), జిల్లా కలెక్టర్ దివాకర్ (Divakar), ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా భద్రత ఏర్పాట్లుచేశారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో పాటు హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.






