డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ !
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్‌ను నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం నాడు సభ ప్రారంభం కాగానే పద్మారావు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు పద్మారావును సభలో స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట తోడ్కోని వస్తారు. పద్మారావు గౌడ్ తెలంగాణ మొదటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.













