ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే
ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయంలోనే 77 కోట్ల టీకాలను ఉచితంగా వేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పి.మురళీధర్ రావు అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోన్న సమయంలో తిరిగి సామాన్య పరిస్థితులు నెలకొనడానికి కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందన్నారు. జనాభాకు తగ్గట్టుగా వైద్యులు, ఆస్పత్రులు లేనప్పటికీ కేంద్రం మంచి ప్రణాళికతో కరోనా మొదటి, రెండో విడత వేవ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. కరోనా మూడో వేవ్ కూడా వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈలోపుగానే ఉద్యమంలా ప్రజలకు ఉచితంగా టీకాలు వేసి ప్రాణనష్టం తగ్గించల్గినట్లు తెలిపారు.













