తమతో రాజకీయ పోరాటం చేయాలి.. కానీ ఇలా కాదు
ఓ వర్గం వారిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో శాంతి వాతావరణాన్ని బీజేపీ కాంక్షించడం లేదని అన్నారు. మహమ్మద్ ప్రవక్త, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తుందని అసద్ ఆరోపించారు. భారత్లో ఉన్న సామాజిక భినత్వాన్ని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన పేర్కొన్నారు. తమతో పోరాటం చేయాలనుకునేవాళ్లు రాజకీయ పోరాటం చేయాలని, కానీ ఇలా కాదు అని అన్నారు. ఒక వేళ ప్రధాని, మోదీ ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వకుంటే అప్పుడు వాళ్లు రియాక్ట్ కావాలన్నారు. సర్ తన సు జుదా నివాదాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు అని అన్నారు.













