ఓయూ కీలక నిర్ణయం..ఏ బహిరంగ సభలకు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటవ్ కౌన్సిల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కౌన్సిల్. క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ కీలక ప్రకటన చేసింది. మే 6వ తేదీన కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వరంగల్ వేదికగా రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఆ మరసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద రాహుల్‌గాంధీ విద్యార్థులతో మమేకం అవుతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే తెలిపారు. అయితే ఇప్పుడు సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.













