ప్రత్యక్ష బోధనకు తొందర లేదు… ఆన్‌లైన్‌లోనే నిర్వహించండి : సీఎం కేసీఆర్

జూలై 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసిన నేపథ్యంలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. అయితే మొదట్లో ప్రత్యక్ష బోధన ద్వారానే తరగతులు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. జూలై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని అన్నారు. ఈ మేరకు విద్యాశాఖకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం సూచించారు. అన్ని తరగతులకూ ఇదే విధానమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓ రోజు 50 శాతం టీచర్లు, మరో రోజు 50 శాతం టీచర్లు హాజరయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు.