ఆన్లైన్లో పూజలు చేసుకోండి
తెలంగాణ దేవాలయాల్లో ఆన్లైన్లో పూజలు చేయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం లభించింది. కరోనా కారణంగా గుడికి వెళ్లలేక పోతున్నాం. దేవుడికి పూజలు చేయాలంటే వీలు కావడం లేదన్నవాళ్ళకోసం ఆన్లైన్లో పూజలు చేసుకునే ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, కొండగట్టు హనుమాన్ దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లలో ఆన్లైన్ ద్వారా పూజలు చేసుకోవచ్చు.













