వరంగల్ కు మరో ఐటీ కంపెనీ
వరంగల్ అర్బన్ జిల్లాకు మరో ఐటీ కంపెనీ వచ్చింది. వరంగల్ నగరంలో గత నెల టెక్ మహీంద్రా, సైయెంట్ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా అదివారం మరో ఐటీ కంపెనీ క్వాడ్రంట్ కు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ భూమి పూజ చేశారు. ఈ కంపెనీ పూర్తయితే ఇక్కడ 500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భిస్తాయని మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు తరలి వచ్చేందుకు ఐటీ కంపెనీలు ఎదురుచూస్తున్నాయన్నారు. వరంగల్‌లో ఎన్ఐటీ కళాశాలతో పాటు 16కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, దీంతో ఐటీ కంపెనీలకు అవసరమైన విద్యార్థులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఎండీ నర్సింహారెడ్డి, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఐటీ కంపెనీ ప్రతినిధులు వంశీరెడ్డి, భాస్కర్, రాము పాల్గొన్నారు.













