నుమాయిష్ ప్రారంభం
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభం అయ్యింది. 46 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వస్త్ర, అభరణాలు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, తినుబండారాలు తదితర అనేక మంది వ్యాపారులు తమ స్టాళ్లను ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. సుమారు 20 ఎకరాల్లో 1,400 స్టాళ్లు కొలువుదీరాయి. కశ్మీర్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బంగా తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. నుమాయిష్ ప్రారంభమవుతుండడంతో ఆయా స్టాళ్ల నిర్వాహకులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొసాగనుంది. మార్చి 31వరకు ఈ నుమాయిష్ సాగనుంది.













