ఈనెల 18న లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్

ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో విష్ణువర్ధన్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు రెడ్‌క్రాస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు పాల్గొంటాయని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 140 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు.











































































