ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా.. మరో 30 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్ లు

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా హోం ఐసొలేషన్‍లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం మరో 30 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లను సమకూర్చినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని ట్రస్టు కేంద్ర కార్యాలయం నుంచి ఆయా జిల్లాలకు పంపించామని, ఇప్పటికే అందుబాటులో ఉన్న పదింటితో కలిపి మొత్తం 40 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లు కరోనా బాధితులకు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆంధప్రదేశ్, తెలంగాణల్లో నిర్మించతలపెట్టిన ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే.. ఆయా ప్రాంతాలతో పాటు సమీప పట్టణాల్లో ఆక్సిజన్ సమస్య తీరుతుంది. ట్రస్టు ద్వారా అందిస్తున్న టెలిమెడిసిన్, ఆన్‍లైన్ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 720 మంది ఈ వైద్య సేవలు పొందగా 416 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపారు.