ఎన్నారైలకు శుభవార్త…. భూములు అమ్ముకోవచ్చు

ఎన్నారైలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ధరణి పోర్టల్‍లో ఎన్నారైలు రాష్ట్రంలోని తమ భూములను అమ్ముకొనేందుకు అవకాశం కల్పించింది. ఇందు కోసం ఎన్నారై పోర్టల్ ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ (సేల్/గిఫ్ట్) పేరుతో ఆప్షన్‍ను తీసుకొచ్చింది. దీనిని వినియోగించాలంటే ఎన్నారైలు ముందుగా ఆ భూమిని ఒక వ్యక్తికి జీఏపీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నారైలు ధరణిలోని ఎన్నారై పోర్టల్ లో లాగిన్ అల్వాలి. ఆ తర్వాత సేల్ లేదా గిఫ్ట్లో ఏది చేయాలనుకొంటున్నారో ఎంచుకోవాలి. ఎంత విస్తీర్ణం మేర అమ్మదలుచుకున్నారో వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత జీఏపీ నంబర్ ఎంటర్ చేస్తే.. జీపీఏ చేయించుకున్న వ్యక్తి పేరు, ఇతర వివరాలు కనిపిస్తాయి. అన్నీ సరిగా ఉన్నాయని భావిస్తేనే ముందుకు వెళ్లాలి అని ప్రకటించింది.