తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల విరాళాల కోసం ప్రత్యేక యాప్
రాష్ట్రంలో పలు దేవాలయాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్ఆర్ఐల విరాళాలను స్వీకరించడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గురువారం హైదరాబాద్‌లోని ఆరణ్యభవన్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇందక్రరణ్‌రెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన టీ యాప్ పోలియో మొబైల్ యాప్‌లోని నాన్‌రెసిడెంట్ ఇండియన్ అనే ప్రత్యేక ఆప్షన్ ద్వారా ప్రవాస భారతీయులు ఆలయాలకు విరాళాలు ఇవ్వవచ్చు. ప్రస్తుతం యూదాద్రితో పాటు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలు, సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం, కర్మన్‌ఘాట్‌లోని ఆంజనేయస్వామి ఆలయాలను మాత్రమే ఇందులో పొందుపరిచామని, త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలను చేరుస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అధికారులు కె జ్యోతి, రామకృష్ణ, యాదాద్రి, వేములవాడ, బాసర ఆలయాల ఈవోలు గీతారెడ్డి, కృష్ణప్రసాద్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అర్చక సంక్షేమ ట్రస్ట్‌ను నియమించటంతో పాటు అర్చక, ఉద్యోగులందరికీ బీమా సదుపాయం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కోరింది. సమితి ప్రతినిధులు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.













