ఎన్ఆర్ఐ సెల్‌తో సత్ఫలితాలు
పోలీసు శాఖలో ప్రత్యేకంగా ప్రవాస భారతీయుల (ఎన్నారై) మోసాలను అరికట్టేందుకు ఏర్పాటైన మహిళా భద్రతా విభాగం మరింత పకడ్బందీగా వ్యవహరించనుంది. రాష్ట్రంతో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎన్నారై పెళ్లుళ్లు, విదేశాలలో మహిళలపై గృహ హింస, వరకట్న వేధింపులు తదితర కేసులు పెద్ద ఎత్తున సమోదవుతున్నాయి. దీనితో ఈ కేసుల పరిష్కారంలో సరైన మార్గదర్శకం లేకపోవడం, విదేశాల చట్టాలపై అవగాహన లోపం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలలో సమన్వయం చేయాల్సి రావడంతో ఈ కేసుల పరిష్కారంలో అంతగా పురోగతి లేకపోవడం, ఈ కేసుల పరిష్కారంపై బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టు తిరగడం పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వ పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఎన్నారై మహిళా భద్రతా విభాగాన్ని 2019 జులై 17న ప్రారంభించింది. ఈ ఎన్నారై విభాగం ప్రారంభంతో ప్రవాస కేసులలో కదలిక ఏర్పడి, ఛార్జిషీట్ల దాఖలు, లుక్ అవుట్ నోటీసుల జారీ, పాస్‌పోర్ట్‌ల సీజ్, నిందితులకు శిక్ష పడడం వేగవంతంగా జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 574 కేసులు ఎన్నారై వరుళ్లపైనా, వారి బంధువులపైనా రాష్ట్రవ్యాప్తంగా 17 మహిళా పోలీస్స్టేషన్లలోనూ, ఇతర పోలీస్స్టేషన్ల్లో నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 17 మహిళా పోలీస్స్టేషనల్లో 417 కేసులు రిజిస్టరయ్యాయి. హైదరాబాద్ సిటీ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్లో 137, రాచకొండ పరిధిలో 78, సౌత్‌జోన్ మహిళా పోలీస్స్టేన్లో 65, బేగంపేట మహిళా స్టేషన్లో 34, భువనగిరి మహిళా స్టేషన్లో ఒక కేసు, గచ్చిబౌలి మహిళా స్టేషన్లో 8 కేసులు, వరంగల్ అర్బన్ మహిళా సేష్టన్‌లో 42 కేసులు, ఖమ్మంలో ఏడు కేసులు, మహబూబ్‌నగర్‌లో ఆరు కేసులు, ఆదిలాబాద్‌లో 11 కేసులు, కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో 21, నల్గొండ స్టేషన్లో ఏడు కేసులు నమోదయ్యాయి













