తెలంగాణలో ఎన్ఆర్ఐ ఓటర్లు… ఎంతమంది అంటే ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మొత్తం ఓటర్ల జాబితాలో ఎన్ఆర్ఐలు 2,944 మంది ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో పురుషులు 2,380 మంది ఉంటే, మహిళలు 563 మంది ఉన్నారు. మిగిలిన ఒక్కరూ ట్రాన్స్‌జెండర్‌గా నమోదయ్యారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,26,18,205 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,62,98,418, మహిళలు 1,63,01,705 , ట్రాన్స్‌జెండర్స్ 2,676 ఉన్నారు. కాగా సర్వీస్ ఓటర్లు మొత్తం 15,406 మంది ఉన్నారు. ఇక 18`19 మధ్య వయస్సు ఓటర్లు 9,99,667 ఉండగా, 80 సంవత్సరాల పైబడిన ఓటర్లు 4,40,371 మంది ఉన్నారు.













