ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గం భేటీ
ఎన్నారైల బృందం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ యూకె సెల్ నిర్ణయించింది. దుబ్బాక అభివృద్ధిపై ప్రత్యేక కర పత్రాలను, అలాగే తెలంగాణ అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాల్ని ఇంటింటికి ప్రచారం చేసేలా వివిధ కార్యక్రమాలని చేపట్టేలా కార్యాచరణకు దిగనుంది. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అడ్వైసరీ బోర్డు వైఎస్ చైర్మన్ సిక్కా చంద్ర శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సత్య చిలుముల పాల్గొన్నారు.













