దుబ్బాకలో ఎన్నారై బృందం ప్రచారం
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రచారం చేస్తుందని ఆ శాఖ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి తెలిపారు. లండన్‌లో సమావేశమైన వారు ముందుగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సలహా మండలి వైఎస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల సంయుక్త నాయకత్వంలోని ఎన్నారైల బృందం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు.













