కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం : అనిల్ కూర్మాచలం
పెంచిన పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుమేరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాల బీజేపీ పాలనలో సామాన్యుల బ్రతుకు ఆగమయ్యిందని, ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. దేశ ప్రజలంతా మోదీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జయసింహ, వల్లాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.













