అమలు కానీ ఎన్నారై పాలసీ : రాజేశ్వరి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారై పాలసీ హామీగానే మిగిలిపోయిందని బీజేపీ ఓబీసీ మోర్చా ఎంబీసీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. ఈ సంద్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నారైల అంశాన్ని 2014 సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై పాలసీ కోసం బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిందన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నవారి కోసం కేరళ ప్రభుత్వం మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే వెయ్యి కోట్ల ప్రత్యేక ప్యాకేజీ వెంటనే ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.













