పాలకుర్తి బరిలో ఝాన్సీరెడ్డి
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా, రాజ్ ప్రాపర్టీ సీఈఓగా, హనుమాండ్ల రాజేందర్ రెడ్డి-ఝాన్సీ రెడ్డి ఫౌండేషన్‌కి సహ వ్యవస్థాపకురాలుగా ఉంటూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 30 ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకోసం ప్రభుత్వానికి ఇచ్చారు. తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పుట్టిన గడ్డ మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్న రaాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు.
ఇటీవల అమెరికా వెళ్ళిన టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులతో జరిపిన మంతనాలు, అమెరికా పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని కూడా రaాన్సీరెడ్డి కలుసుకున్న తరువాత ఇండియాకు వచ్చి పాలకుర్తిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు. పాల కుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు తనపై ఉన్న ప్రేమే అమెరికా నుంచి తనను రప్పించిందని ఝాన్సీరెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలో గల తన స్వగ్రామమైన చెర్లపాలెంతో పాటు తొర్రూరులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 40 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డామని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుపుకొని వారి మార్గదర్శకత్వంలో పని చేస్తానని అన్నారు. ఇలవేల్పు దైవమైన సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు. ఆలయం గుట్టపైన 30 సెల్లార్లతో కలిపి నిర్మించే 30 మూడంతస్తులు గల గదులు, 50వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మించి ఇస్తానని వెల్లడించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఝాన్సీరెడ్డి జనగామ చౌరస్తా నుంచి దేవరుప్పుల, మొండ్రాయి మీదుగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భారీ కాన్వాయ్‌తో తరలివచ్చినప్పుడు ఆమెకు ఘనస్వాగతం లభించింది. యువత కూడా ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. కాగా, ఝాన్సీరెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.













