స్వగ్రామంలో ఆసుపత్రి ప్రారంభిస్తానన్న ప్రవాస వైద్యుడు
తన సొంత గ్రామమైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజవకవర్గంలోని చిరాగ్పల్లి గ్రామంలో తాను ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని సిద్ధం రెడ్డి ఉజ్వల్ అనే ప్రవాస తెలంగాణ వైద్యుడు మంత్రి కేటీఆర్కు ట్విటర్లో తెలిపారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో న్యూరో సైకియాట్రిస్టుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుద్ది చేసిన నీటిని కూడా అందిస్తానని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాభావంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ఉజ్వల్కు ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ను మంత్రి కోరారు.













