“మన ఊరు మన బడి” కార్యక్రముపై మంత్రి కేటీర్ తో భేటీ అయినా ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలా.. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫై ఎన్నారైల బాగస్వాములపై చర్చ
ఈరోజు మంత్రి కేటీర్ తో ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల భేటీ అయ్యారు, ఈ భేటీ లో మన ఊరు – మన బడి కార్యక్రమంపై ఎన్నారైల బాగస్వాములపై చర్చ జరిగింది. మహేష్ బిగాల మాట్లాడుతూ తెలుగు మీడియంలో చదువుకొనే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతున్నారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నారు. ఇప్పటికే మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతోంది. ఈ చట్టంతో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల తెలంగాణ బిడ్డలు రాష్ట్రములోని కాకుండా, దేశములో, ప్రపంచములో ఎక్కడైనా పోటీ పరీక్షలకు సిద్ధం అయి వుంటారు, విద్యార్థులకు భాష అడ్డంకి కాకూడదు అని అన్నారు.అలాగే స్వంతంగా తనకు విద్యాసంస్థలు వున్న అనుభవం దృశ్య తాను చదివిన పాఠశాలకు ఉరి పైన వున్నా మమకారముతో తాను భాగస్వామిని అవుతాను అని ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకెళ్లగా ప్రభుత్వ తరపున అలాగే తన స్వంత కోటి రూపాయలతో కార్పొరేట్ కి దీటుగా సకల సదుపాయాలతో నిర్మాణం చేపడుతున్నారు.
అలాగే త్వరలోనే ఎన్నారైలతో కలిసి ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి ఎన్నారైలను వల్ల వల్ల స్వంత గ్రామములో భాగస్వామి అయ్యి పాఠశాలలను అభివృద్ధి చేసే విదంగా చేప్పట్టే కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా కేటీర్ గారు మరియు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇంత పెద్ద ప్రోగ్రాం రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. అందరి ఎన్నారైల తరపున మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, మంత్రి కేటీర్ గారికి మరియు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
మన ఊరు – మన బడి అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడింది. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలతో ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి దశలో 65 శాతం (సుమారు 13 లక్షల మంది) విద్యార్థులను కవర్ చేసేలా మొత్తం పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న 9,123 (35 శాతం) పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభించబడుతోంది. ఇందుకోసం మొదటి దశలో దాదాపు రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనున్నారు.













