ఎన్నారై సెల్ కు ఏడాది పూర్తి : స్వాతిలక్రా
ఎన్నారై భర్తల వేధింపులు, గృహ హింస కేసుల్లో బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ఎన్నారై సెల్ శనివారంతో ఏడాది పూర్తిచేసుకున్నది. రాష్ట్రమహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో కొనసాగే ఈ సెల్లో ఏడాదిలో 101 ఎన్నారై భర్తల కేసులు పలుదశల్లో దర్యాప్తులో ఉన్నట్టు ఉమెన్‌సేఫ్టీ వింగ్ ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు కేసుల్లో నిందితులకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశామని, మరో ఆరు కేసుల్లో నిందితుల పాస్‌పోర్టులను జప్తుచేసినట్టు వివరించారు. భాదిత మహిళలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా, ఎన్జీవో, రాయబార కార్యాలయాల్లో సహకారం అందిస్తున్నట్టు తెలిపారు.













