ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జలగం సుధీర్!
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమినాబాద్ కు చెందిన ప్రవాస భారతీయుడు జలగం సుధీర్ పేరు ఎన్ఆర్ఐ ఆఫ్ది ఇయర్ అవార్డు కు పరిశీలనలో ఉన్నట్లు టైంప్ నౌ, ఐసిఐసిఐ బ్యాంక్ లు ట్విట్టర్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా జలగం సుధీర్ తన స్వగ్రామం తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలకు విద్య, వైద్య కోసం స్వచ్ఛందంగా కృషి చేసారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలు మిషన్ కాకతీయ లో చెరువుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం పథకల తో పాటు, యువత ఉపాధికి మార్గాలు కల్పిస్తూ సామాజిక సేవలో ఉన్నారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ఈ అవార్డు ఎంపిక కోసం సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కెటీఆర్, కడియం శ్రీహరి, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.













