హైదరాబాద్ లో యూఎస్ ఆటా బాట్లింగ్ ప్లాంట్
ప్రపంచంలోనే ప్యాకేజ్డ్ బాట్లింగ్ ప్లాంట్ తన మంచినీటి అవసరాలు తీర్చడానికి గాలిని ఉపయోగింంచుకోనున్నది. గాలి నుంచి నీటిని తీసే సృజనాత్మక టెక్నాలజీని అనుసరించడంలో ముందడుగు వేసిన యుఎస్ ఆటా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో ఈ ప్లాంట్‌ను నెలకొల్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా గాలి నుంచి నీటిని తీసే బాట్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన యూఎస్ ఆటా నిర్వహించనున్నది. దీనికి బిఐఎస్, ఎఫ్ఎస్ఎస్ఎఐ సర్టిఫికెట్ కూడా ఉంది. ఐఎస్ఐ గుర్తు వాడకానికి గాను బిఐఎస్ యూఎస్ ఆటా ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లైసెన్స్ జారీ చేసిందని, బిఐఎస్ హైదరాబాద్ హెడ్ కెవి రావు తెలియజేశారు. యుఎస్ ఆటా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ సచిన్ వడ్డవల్లి బాటిల్డ్ వాటర్ కోసం గాలి నుంచి నీటిని తీయడం కొత్త విధానం అని పేర్కొన్నారు.













