నేనూ ఏపీకి వస్తా
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషికి ఆమె లేఖ రాసినట్లుగా తెలిసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఐఏఎస్ అధికారుల విభజన సమయంలో ఆమె తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. అయితే ఆమె అంతకు ముందు జగన్ ఆస్తుల కేసులో సిబిఐ నుంచి విచారణ ఎదుర్కొని నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అక్కడ జగన్ సీఎం కానుండటంతో ఆ రాష్ట్రంలో విధులు నిర్వహించాలని కోరుకుంటున్నారు.













