తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో త్వరలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో జూన్ 3వ తేదీతో ఆరుగురు ఎమ్మెల్సీ గడువు ముగిస్తుంది. గడువు ముగిస్తున్న ఎమ్మెల్సీలలో గుత్తా సుఖేందర్‍రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరుదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు ఈ ఆరు స్థానాలకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాల ఉన్నాయి. గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతుంది. ఈ మేరకు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగిస్తుంది. అయితే కేబినెట్ నిర్ణయం మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును భర్తీ చేసేందుకు గవర్నర్‍కు సిఫార్సు చేయాల్సి ఉంటుంది.