హైదరాబాద్ కు రెడ్ అలర్ట్… మూడు రోజుల పాటు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉదయం నుంచి ముసురు పట్టింది. అయితే రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తెలంగాణలోని 14 జిల్లాలను కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిది. లోతటు ్ట ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని చెప్పింది.













