ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెండిటీ కార్డును భగత్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.













