తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్…

ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉండదని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రానికి అందాల్సిన వ్యాక్సిన్ డోసులు చేరకపోవడంతో పంపిణీ పక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 18-44 ఏళ్లలోపు వారికి నేటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యంకాదని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ డోసులు నిడుకోవడంతో 45 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం కష్టంగా మారినట్లు కనిపిస్తోంది. కేంద్రం నుంచి విడుదలయ్యే కోటా రాష్ట్రానికి చేరితే తప్ప వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి లేదు. మే 1 నుండి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.