తెలంగాణ రేషన్ షాపుల్లో నగదు బదిలీ.. స్టడీ చేయండి..సియమ్
కేసీఆర్ కిట్లు, ప్రజాపంపిణీ వ్యవస్తపై రివ్యూ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజలకు చేరుతున్న తీరుమీద అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్లతో సర్కారీ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఇక రేషన్ షాపుల నుంచి సరుకుల బదులు నగదు బదిలీ అవకాశాలపై స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.
రేషన్ సరుకుల బదులు నగదు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందో ..స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. పౌరసరఫరాల శాఖపై రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. రేషన్ డీలర్లు సమ్మె నోటీస్ పై కూడా చర్చించారు. దీనిపై వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఏటా 6వేల 5వందల కోట్లు ఖర్చు చేస్తున్నా…ఆశించిన ఫలితం రావడం లేదన్నారు. బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయన్నయన్నారు. సరుకుల పంపిణీలో అక్రమాలు, అవకతవకలను జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం జరిగేలా చర్యలు తీసుకోవాని ఆదేశించారు. బియ్యం అక్రమ రవాణా మాఫియా ఏర్పడిందని, ఈ పరిస్థితి పోవాలని సూచించారు. రేషన్ డీలర్లు సమ్మె ఆలోచన విరమించకపోతే నగదు నేరుగా.. లబ్ధిదారులకు అందేలా చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
ఇక కేసీఆర్ కిట్స్ పథకంతో పాటు హస్పిటల్స్ డెవలప్ మెంట్ విష యంలో ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్లే ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని అన్నారు సీఎం కేసీఆర్. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వైద్యఆరోగ్య శాఖ మరింత బాగా పనిచేయాలని వైద్యులను కోరారు. ప్రగతిభవన్ లో అధికారులతో రివ్యూ చేశారు సీఎం.
రాబోయే కాలంలో ప్రజావైద్యం ఎలా ఉండాలనే విషయంలో అధికారులు హెల్త్ మ్యాప్ రూపొందించాలని కేసీఆర్ కోరారు. కేసీఆర్ కిట్స్ పథకంతో పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సిఎం సంతకం చేశారు. కేటాయించిన బెడ్లకన్నా ఎక్కువ సంఖ్యలో పేషెంట్లు వస్తున్నా సరే, పేదలకు వైద్య సేవలు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. చాలా మంది ఓవర్ టైమ్ పనిచేస్తున్నరని సిఎం మెచ్చకున్నరు. అలాగే ఏజన్సీలలో అంటు వ్యాధులు, విష జ్వరాలు రాకుండా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు కూడా బాగున్నాయమన్నారు.













