సచివాలయ ప్రారంభానికి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం రాలేదు : రాజ్ భవన్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాకపోవడంపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గౌరవ గవర్నర్‌కు ఆహ్వానం అందిందని, ఆహ్వానం అందించినప్పటికీ గవర్నర్ హాజరు కాలేదన్న నిరాధారమైన, తప్పుడు ఆరోపణలను రాజ్‌భవన్ తీవ్రంగా ఖండించింది. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఆహ్వానం రానందున ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజురు కాలేదని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు రాజ్ భవన్ మీడియాకు ప్రకటన విడుదల చేసింది.













