హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వేడుకలపై.. హైకోర్టు

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లో విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పస్టం చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్ఞనం చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.