జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదు
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద సాయాన్ని బీజేపీ ఆపిందంటూ టీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. తన సంతకం ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు. బీజేపీ వల్లే వరద సాయం ఆగిందని చెబుతున్న.. కేసీఆర్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం రావాలసి సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు ఎంత నష్టం జరిగితే అంత పూర్తి స్థాయిలో అందజేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బండి సంజయ్ సృష్టం చేశారు.













