చరిత్రలో నిలిచిన నిజామాబాద్ ఎన్నికలు
దేశ చరిత్రలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరోసారి నిలిచింది. గతంలో అతి పెద్ద బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు కొనసాగిన నిజామాబాద్, తాజాగా ఎన్నికల్లో కూడా రికార్డు సాధించింది. ఎన్నికల కమీషన్ దేశంలోనే మొదటిసారిగా ఒక్క పోలింగ్ బూత్‌లో 12 ఇవిఎంలను కేటాయించి వాటి ద్వారా, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను నిర్వహించింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1788 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కాగా, ప్రతి పోలింగ్ స్టేషన్లో 12 ఈవిఎంలను ఏర్పాటు చేసింది. దీంతో 21వేలకు పైగా ఈవిఎంలను ఒక్క నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేసిన ఘనత ఎన్నికల కమిషన్‌కు దక్కింది.













