నిమ్స్‌కు రూ.2.1 కోట్ల విరాళం

పీడియాట్రిక్ ఎపీలెప్సీ సెంటర్ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్‌కు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్, మొయినాబాద్ ఆధ్వర్యంలో ఈ సంస్థ రాయదుర్గంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చెక్కును నిమ్స్ డైరెక్టర్ డా.ఎన్.బీరప్పకు అందించింది. ఈ మేరకు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, నిమ్స్, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, నిమ్స్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.