భారత్ నుంచి డాక్టర్ కేశవులుకు అవకాశం…

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులుకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యర్యా సమితి ఆధ్వర్యంలోని ఆహార, వ్యవసాయ సంస్థ (డబ్లూఎఫ్‍ఏవో) ఏర్పాటు చేసిన శాస్త్ర, సాంకేతిక సలహా మండలికి ఆయన సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ అవకాశం భారత్‍లో కేశవులకు మాత్రమే దక్కడం గమనార్హం. భారత ధాన్యాగారంగా పేరొందిన తెలంగాణకు విత్తనాభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్నది. గతేడాది ఇటలీలో జరిగిన కాన్ఫరెన్స్లో డాక్టర్ కేశవులు ఎఫ్‍ఏవో డైరెక్టర్ జనరల్ క్యూ డొంగ్యూతో సమావేశమై తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధిని వివరించారు.