సీఎం కేసీఆర్ విగ్రహం ఆవిష్కరణ..

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్ధమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ స్వరాష్ట్ర కలను నిజం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తుగా సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సర్పంచ్ తెలిపారు. కేసీఆర్ పట్ల నిలువెత్తు అభిమానాన్ని చాటుకున్న సర్పంచ్‍ను గ్రామస్థులు అభినందించారు.